‘సైజ్‌ జీరో’ కోసం బరువు పెరగడంపై అనుష్క కామెంట్

‘సైజ్‌ జీరో’ కోసం బరువు పెరగడంపై అనుష్క కామెంట్

Published on Aug 18, 2015 7:00 PM IST

anushka
ఎలాంటి పాత్రనిచ్చినా ఆ పాత్రను అలాగే అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా మారిపోవడం నటులందరికీ సాధారణంగానే ఉండాల్సిన లక్షణం. ఇక కొన్నిసార్లు శారీరకంగానూ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. తెలుగులో ఓ హీరో స్థాయి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న నటి అనుష్క, పాత్రల ఎంపికలో ఎన్ని ప్రయోగాలు చేశారో, అందుకు తగ్గట్టుగానే మారిపోవడంలోనూ అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. అరుంధతి, బిల్లా, బాహుబలి లాంటి సినిమాలు అనుష్క చేసిన ప్రయోగాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.

ఇక తాజాగా అనుష్క హీరోయిన్‌గా నటించగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోన్న ‘సైజ్ జీరో’ కొరకు అనుష్క చేసిన ప్రయోగం అందరినీ ఆశ్చర్యపరిచింది. సైజ్ జీరో పాత్ర కోసం అనుష్క, తన సాధారణ బరువు కంటే 25 కిలోల ఎక్కువ బరువు పెరిగారు. బరువు పెరిగిన తర్వాత అనుష్క ఎలా ఉండనుందనేది ఫస్ట్‌లుక్స్ ద్వారా రివీల్ అయింది. ఆ పోస్టర్స్ చూసిన వారంతా అనుష్క డెడికేషన్‌కు ఫిదా అయిపోయారు. ఇక ఇదే విషయంపై అనుష్క మాట్లాడుతూ.. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ కాలంలో గ్రాఫిక్స్‌తో మేనేజ్ చేసుకోవచ్చని తెలిసినా, పాత్ర కోసం తానే స్వయంగా బరువు పెరగాలనుకొని ఆ నిర్ణయం తీసుకున్నారట. దర్శకుడు, నిర్మాత ఈ విషయంపై ఎలాంటి ఆలోచన చేయకముందే అనుష్క బరువు పెరిగేందుకు సిద్ధపడడం ఆసక్తికర అంశం. ఇక బరువు పెరిగేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎక్కువ మోతాదులో తీసుకున్నానని అనుష్క తెలిపారు.

ఆర్య హీరోగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సైజ్ జీరో సినిమాను పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. ఒక్క పాట మినహా షూటింగ్ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది. అక్టోబర్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు