పెళ్లి పుకార్లను ఖండించిన అనుష్క.

పెళ్లి పుకార్లను ఖండించిన అనుష్క.

Published on Sep 18, 2014 11:10 AM IST

anushkaphoto
ప్రస్తుతం బెంగుళూరు హాట్ బ్యూటీ అనుష్క ‘బాహుబలి’, రజినీకాంత్ ‘లింగా’, అజిత్ – గౌతమ్ మీనన్ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంది. ఈ సినిమాల షూటింగ్ లు పూర్తయిన తర్వాత ఈ యోగ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందంటూ అంటూ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీటిని ఖండించింది అనుష్క. తన మేనేజర్ ద్వారా వివరణ ఇచ్చింది.

‘అనుష్క త్వరలో పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమే. ప్రస్తుతం ‘బాహుబలి’, ‘లింగా’, అజిత్ సినిమాలలో నటిస్తున్నారు. తర్వాత ‘పిల్ల జమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకేక్కబోయే ‘బాగమతి’లో నటిస్తారు. ఈ సినిమాలు పూర్తి అయ్యేవరకు కొత్త సినిమాలకు సైన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని’ అనుష్క మేనేజనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు