
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ స్టార్ హీరోస్ తో మరియు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న టాప్ హీరోయిన్ అనుష్క. ఇటీవలే బాహుబలి తో సక్సెస్ అందుకున్న ఈ భామ త్వరలోనే మరో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అవే ‘రుద్రమదేవి’ అండ్ ‘సైజ్ జీరో’. రుద్రమదేవిని పక్కనపెట్టి సైజ్ జీరో విషయానికి వస్తే.. ఇప్పటి వరకూ స్లిమ్ అండ్ హాట్ హాట్ గా కనిపించిన అనుష్క ‘సైజ్ జీరో’లో అందరినీ ఆశ్చర్య పరిచేలా బాగా బొద్దుగా కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అనుష్క లుక్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవ్వడమే కాకుండా ఇదే విషయాన్ని టాక్ అఫ్ ది టౌన్ గా మార్చారు.
ఈ సినిమా కోసం అనుష్క అమాంతం 20 కేజీలు బరువు పెరిగింది. ఇంత రిస్క్ తీసుకొని సినిమా కోసం అమాంతం వెయిట్ పెరిగి మళ్ళీ తగ్గుతోన్న అనుష్క గురించి మాకో షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేమిటంటే ఈ చిత్ర టీం తెలిపిన సమాచారం ప్రకారం సైజ్ జీరో కోసం ఎంతో రిస్క్ చేసిన అనుష్క ఏ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేసిందట. సినిమా మొదలై ఫినిష్ కూడా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కానీ అనుష్క మాత్రం ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోవడంలేదని తెలిపారు. దీని వెనకున్న విషయం ఏమిటనేది తెలియాల్సి ఉంది. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్య హీరోగా కనిపించనుంటే, సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్ గా కనిపించనుంది.
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 6న రిలీజ్ చేసి, సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. పివివి బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

