వెయిట్ తగ్గే పనిలో బిజీగా ఉన్న అనుష్క

వెయిట్ తగ్గే పనిలో బిజీగా ఉన్న అనుష్క

Published on Jul 21, 2015 1:58 PM IST

Anushka
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హాట్ బ్యూటీ అనుష్క రెండు వారల క్రితం రిలీజ్ అయిన ‘బాహుబలి’ సినిమాలో మునుపెన్నడూ చూడని ఓ డిఫరెంట్ గెటప్లో కనిపించి అందరినీ షాక్ చేసింది. బాహుబలి పార్ట్ 1 లో తను కనపడింది కాసేపే అయినా ఉన్నంతలో పెర్ఫార్మన్స్ తో మెప్పించింది. ఇది పక్కన పెడితే అనుష్క చేసిన నెక్స్ట్ ద్విభాషా చిత్రం ‘సైజ్ జీరో’. రీసెంట్ గా అనుష్క ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసింది. అనుష్క ఈ సినిమా రెండు పాత్రల్లో కనిపించనుంది. అందులో ఓ పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగిందని కూడా ఇది వరకే తెలియజేశాం.

ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవడంతో అనుష్క ప్రస్తుతం వెయిట్ తగ్గే పనిలో ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వెయిట్ తగ్గడం కోసం ఈ యోగ బ్యూటీ ఫుల్ డైటింగ్ లో ఉందని చెబుతున్నారు. త్వరలోనే తను వెయిట్ తగ్గి బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగ్ లో పాల్గొననుంది. ప్రస్తుతం బాహుబలి టీం అంతా కాస్త గ్యాప్ తీసుకొని హాలిడేకి వెళ్ళారు. సెప్టెంబర్ నుంచి బాహుబలి పార్ట్ 2 షూటింగ్ మొదలు కానుంది. సెకండ పార్ట్ లో అనుష్క రోల్ ఎక్కువగా ఉండనుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సైజ్ జీరో సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు