గత ఏడాది ‘భాగమతి’ తో ప్రేక్ష,కులముందుకు వచ్చిన స్టార్ హీరోయిన్ అనుష్క మరో చిత్రం చేయడానికి ఏడాదికి పైనే సమయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించడానికి సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ అమెరికాలోని సియాటెల్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ అంత ఫారెన్ లోనే జరుగనుంది. ఈ చిత్రంలో మాధవన్, సుబ్బరాజ్ , అంజలి , షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.
గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.
