సైరా లేటెస్ట్ : సైరా లో అనుష్క రోల్ ఇదేనా…?

Published on Sep 10, 2019 12:00 am IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా… రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ చిత్రాన్ని చాలా భారీగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి ప్రస్తుతానికి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో అనుష్క నటిస్తుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రానికి సంబందించిన టీజర్ లో కానీ, మేకింగ్ వీడియో లో కానీ అనుష్క ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే మళ్ళీ ఈ సినెమలి అనుష్క నటిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ సైరా సినిమాలో అనుష్క ఎంతో ప్రాధాన్యం గల ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. అందుకనే ఇప్పటివరకు కూడా అనుష్క పాత్రని కావాలనే బయటపెట్టలేదని సమాచారం. కానీ దీనికి సంబందించిన విషయాలు అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More