అనుష్క ‘సైలెన్స్’ లేటెస్ట్ అప్ డేట్ !

అనుష్క ‘సైలెన్స్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 4, 2019 10:54 AM IST

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. తెలుగులో ఈ సినిమా ‘నిశ్శబ్దం’గా రానుంది. ఈ చిత్రం నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ పజిల్ లా ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబధించి ఇప్పటికే కీలకమైన షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తరువాత షెడ్యూల్ నుండి సాంగ్స్ చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

కాగా ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించబోతుందట. అలాగే మాధవన్ సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట.

ఇక ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు