ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు – అనుష్క శర్మ

Published on Mar 31, 2020 1:49 pm IST

అనుష్క శర్మ కొంత విరామాన్ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలను తగ్గించుకుంది. అయితే ఆమె తల్లి కావడానికే విరామం తీసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా అనుష్క శర్మ దీనికి సమాధానమిస్తూ.. ‘నేను తల్లి కాబోతున్నాననే విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

ప్రస్తుతం నేను సినిమాలు చేయడం లేదంటే దానికి కారణం నాకు నచ్చిన కథ దొరకడం లేకపోవడమే. నాకు నచ్చిన కథ దొరికితే నేను నటించడమే ఒక్కటే కాదు, నిర్మిస్తాను కూడా. ఇక త్వరలోనే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాను అని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. అలాగే అనుష్క శర్మ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను డబ్బులను సంపాదించడానికి యాక్ట్ చేయట్లేదని.. కేవలం నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే నటిని అయ్యానని తెలిపింది.

ఇక విరాట్‌-అనుష్కల పెళ్లి డిసెంబర్‌ 11న ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో.. 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో వైభవోపేతంగా జరిగిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.

సంబంధిత సమాచారం :

X
More