Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
మార్చి లో అనుష్క కొత్త సినిమా స్టార్ట్ కానుంది !
Published on Jan 11, 2019 7:00 pm IST

గత ఏడాది ప్రారంభంలో ‘భాగమతి’ తో హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్అనుష్క ఈ చిత్రం తరువాత వెయిట్ తగ్గడానికి యూఎస్ వెళ్లి ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది. ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న థ్రిల్లర్ మూవీ లో నటించడానికి సిద్దమవుతుంది. ఈ చిత్రంలో మాధవన్, సుబ్బరాజ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ‘సైలెన్స్’ అనే టైటిల్ తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఆయన ఈ సినిమా కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను కంపోజ్ చేశారట.

ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ మార్చి లో మొదలు కానుంది. ఈ చిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ విదేశాల్లో జరుగనుంది. కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :