టాప్ డైరెక్టర్స్ చేతులమీదుగా నిశ్శబ్దం టీజర్ గ్రాండ్ రిలీజ్

టాప్ డైరెక్టర్స్ చేతులమీదుగా నిశ్శబ్దం టీజర్ గ్రాండ్ రిలీజ్

Published on Nov 6, 2019 10:00 AM IST

Nishabdam1

సౌత్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న అనుష్క శెట్టి బాహుబలి చిత్రం తరువాత చేసిన భాగమతి విడుదలై చాలా కాలం ఐపోతుంది. ఆమె 2019లో కేవలం సైరా నరసింహారెడ్డి చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. అనుష్క ఒక్క చిత్రం కూడా విడుదల చేయకుండా ఈ ఏడాది ముగించారు. కాగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రయోగాత్మక చిత్రంలో అనుష్క మూగవారైన పెయింటర్ గా నటిస్తుండగా, మరో ప్రధాన పాత్ర చేస్తున్న మాధవన్ గుడ్డివాడైన వయిలిన్ కళాకారుడిగా కనిపించనున్నాడు.

ఇప్పటికే విడుదలైన వీరి లుక్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. మరో కీలకపాత్ర చేస్తున్న నటి అంజలి అమెరికా లో పనిచేసే క్రైమ్ డిటెక్టివ్ అధికారిగా నటిస్తున్నారు. ఇటీవల ఆమె లుక్ కూడా యూనిట్ విడుదల చేశారు. కాగా నేటి సాయంత్రం 5గంటలకు ఈ చిత్ర టీజర్ ని విడుదల చేస్తున్నారు. పలు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ మూవీ టీజర్ తెలుగులో పూరి జగన్నాధ్ విడుదల చేస్తుండగా, తమిళ మరియు మలయాళ భాషల టీజర్ గౌతమ్ మీనన్ విడుదల చేస్తారు. ఇక హిందీ టీజర్ ని నీరజ్ పాండే విడుదల చేయనున్నారు. కోన ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా షాలిని పాండే మరో కీలక పాత్ర చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు