ప్రస్తుతం తనకుమాత్రమే చేతనైన కొన్ని సినిమాల మధ్య అందాల భామ అనుష్క ఈ ఏడాది అంతా బిజీగా వుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి భారీ ప్రాజెక్ట్ లు వున్నాయి. తెలుగు, తమిళ తేడా లేకుండా సినిమాలలో నటిస్తుంది
తాజా సమాచారం ప్రకారం అనుష్క వచ్చే సంవత్సరం వధువు కానుందట. ఒక పత్రిక కధనం ప్రకారం అనుష్క ఇంట్లోవాళ్ళు తమ కూతురికి తగిన వరుడ్ని వెతికే పనిలో వున్నారని ఇప్పటికే కొంతమంది పేర్లు పరిశీలించారని తెలుస్తుంది
దీనిపై మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి అనుష్క సిద్ధంగా లేదు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి వుండాల్సిందే


