అనుష్క ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..

అనుష్క ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..

Published on Sep 6, 2019 12:00 AM IST

స్టార్ హీరోయిన్ అనుష్క చేస్తున్న కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఛాన్నాళ్ల తర్వాత అనుష్క
చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది. సినిమాలో అనుష్క పాత్రకు సంభందించిన ఫస్ట్ లుక్ ఈ సెప్టెంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిముషాలకు విడుదలకానుంది.

ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ కోసం స్వీటి బరువు కూడా తగ్గి స్లిమ్ అయింది. ఇందులో ఆమె ఎన్నారై బిజినెస్ఉమెన్ పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మాధవన్, షాలిని పాండే, అంజలి, సుబ్బరాజ్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మడిసెన్ కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు