అనుష్క నవ్వే నన్ను ఎంకరేజ్ చేసింది – పోసాని

అనుష్క నవ్వే నన్ను ఎంకరేజ్ చేసింది – పోసాని

Published on Sep 14, 2014 8:56 PM IST

Posani-Krishna-Murali

ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తున్నా అన్ని బిగ్ బడ్జెట్ సినిమాల్లోనూ పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు. ప్రతి సినిమాలో ఒక రెండు సినిమాల పాత్రలోనైనా కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ‘వేదం’, ‘నాయక్’ సినిమాల తర్వాత పోసాని కృష్ణ మురళి నటుడిగా బాగా బిజీ ఐపోయాడు. రైటర్ గా కెరీర్ ని ప్రారంభించి, డైరెక్టర్ గా మారి ప్రస్తుతం నటుడిగా రాణిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.

పోసాని నటుడిగా మారడానికి అనుష్క చేసిన ఎంకరేజ్ మెంట్ కారణం అని అంటున్నాడు. అనుష్క పోసాని నటనలో బాగా ఫన్ ఉందని, అతని నటన మనల్ని నవ్వు ఆపు కోనివ్వకుండా చేస్తుందని అన్నాడు. దాంతో పోసాని నటుడిగా మారి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడట.. ‘చాలా రోజుల తర్వాత డైరెక్టర్ అయ్యాను.. కానీ ప్రస్తుతం నేను నటుడుగా చాలా బిజీగా ఉన్నాను. అస్సలు ఖాళీ టైం ఉండడం లేదని’ పోసాని అంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు