‘సైరా’లో అనుష్క రోల్ అదే !

‘సైరా’లో అనుష్క రోల్ అదే !

Published on Sep 8, 2019 10:35 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా మొత్తంలో మెగాస్టార్ పాత్ర తరువాత మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తోందట. ఆ పాత్రలోనే అనుష్క నటించిందట. అయితే మొదట ఈ సినిమాలో అనుష్క పాత్ర స్టోరీ టెల్లర్ గా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్కకు సంబంధించిన లుక్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు