భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. షూటింగ్ పూర్తయ్యే సమయానికే పలు విభాగాలకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన పనులతో పాటు డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ 19న సినిమాని రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కాస్త ఆలస్యం అవుతుండడతో గుణశేఖర్ ఈ సినిమాని 2015 జనవరిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి నదరూ ఈ సినిమా సంక్రాంతి కానుకగానే రిలీజ్ అవుతుందని అంటున్నారు.
అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.


