బాహుబలిలో అనుష్క కనపడేది ఎంతసేపు.?

బాహుబలిలో అనుష్క కనపడేది ఎంతసేపు.?

Published on Jul 9, 2015 4:03 PM IST

Anushka
టాలీవుడ్ సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాలలో ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అంతకన్నా స్ట్రాంగ్ గా పాత్రలు ఉంటాయి. ఇదే తరహాలోనే 8 పాత్రల చుట్టూ అల్లుకున్న కథతో అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ‘బాహుబలి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రేపు సుమారు 4000కి పైగీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా నటించారు. మొదటి పార్ట్ లో ఎక్కువ భాగం తమన్నా ఉంటుందని, అనుష్క ఉండేది చాలా తక్కువ టైం అని ఈ చిత్ర టీం స్వయంగా తెలియజేశారు.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొదటి పార్ట్ అయిన ‘బాహుబలి – ది బిగెనింగ్’ సినిమాలో అనుష్క మొత్తంగా 7 నిమిషాలు మాత్రమే కనపడుతుందని సమాచారం. అది కూడా రెగ్యులర్ క్వీన్ లా కాకుండా మునుపెన్నడూ చూడని అవతారంలో కనపడనుంది. తన రాజ్యమైన మహిష్మతిలోనే తనొక ఖైదీగా కనపడనుందని సమాచారం. కనపడేది కొద్దిసేపే అయినా అనుష్క పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని కూడా అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా కనపడనున్న తమన్నా కేవలం గ్లామర్ డాల్ కానే కాకుండా యుద్దాలు చేస్తూ మంచి ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది.

ప్రభాస్ – రానాలు ఈ సినిమాలో అన్నదమ్ములుగానే కాకుండా రాజ్యాధికారం కోసం పోటీపడే బడ్డ శత్రువులుగా కూడా కనపడనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు