కొత్త రేట్లతో సినిమా హాళ్లు మూసుకుంటున్న యజమానులు ?

కొత్త రేట్లతో సినిమా హాళ్లు మూసుకుంటున్న యజమానులు ?

Published on Apr 13, 2021 3:00 AM IST


కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్ వ్యవస్థ దారుణమైన నష్టాలను చవిచూసింది. జనవరి నుండి సినిమాలు విడుదలవుతుండటంతో కొద్దిగా కొలుకుంది. పెద్ద సినిమాలు వస్తే పాత పరిస్థితులు వస్తాయని ఎగ్జిబిటర్స్ అనుకుంటున్నారు. అలాంటి టైంలోనే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలైంది. ఈ సినిమా ప్రభావంతో ప్రేక్షకులు సినిమా హాళ్లకు మునుపటిలా అలవాటు పడతారని ఆశించారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం ఎప్పటి నుండో జరుగుతున్నదే. ‘వైల్డ్ డాగ్’ వరకు టికెట్ హైక్ ఉండేది. కానీ ‘వకీల్ సాబ్’కు ఆ వెసులుబాటును తొలగించింది ప్రభుత్వం.

ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్ ధరలకే టికెట్లు విక్రయించాలని ఆదేశాలిచ్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. పాత జీవో ప్రకారమే టికెట్లను విక్రయించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఓవర్ నైట్ జీవో ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఏపీ థియేటర్లలో టికెట్ రేట్లు రూ.20, 15, 10 గా ఉన్నాయి. నాన్ ఏసీ థియేటర్లలో రూ.15, 10, 5 గా ఉన్నాయి. నగర పంచాయితీల్లో ఏసీ థియేటర్ల హయ్యస్ట్ రేట్ రూ.35కి, మున్సిపాలిటీల్లో హయ్యస్ట్ రేట్ రూ. 70కి మించకూడదని జీవోలో తెలిపారు. ఈ ధరలతో థియేటర్లు నడపడం అసాధ్యమని అంటున్నారు థియేటర్ యజమానులు. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీల్లో సినిమా హళ్లు మూసేశారు కూడ. పరిస్థితి ఇలాగే ఉంటే బోలెడంత డబ్బు పెట్టి రెమ్యునరేషన్ చేసుకున్న యజమానులు కష్టాల్లో పడటం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు