
దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ లో అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం జరిగిన ‘అల్లుడు శీను’ ఆడియో వేడుకకు హాజరయిన రాజమౌళి తన ప్రసంగంలో దొర్లిన చిన్న పొరపాటుకు ట్విట్టర్లో వివరణ ఇచ్చారు.
వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి ఠాగూర్ సినిమాలో నటించారు. అయితే రాజమౌళి ‘అల్లుడు శీను’ ఆడియో వేడుకలో ‘ఠాగూర్’ సినిమాకు బదులు ‘స్టాలిన్’ సినిమా అని పలికారు. ‘మన్నించండి… నిన్న జరిగిన అల్లుడు శీను ఆడియో వేడుకలో నేను ‘ఠాగూర్’ కు బదులు స్టాలిన్ అని అన్నారు’ అని ట్విట్టర్లో రాజమౌళి పోస్ట్ చేశారు.
చిరంజీవి గారితో ఠాగూర్ సినిమా తెరకెక్కించినప్పుడు ‘వి.వి.వినాయక్’ ఎంత కష్టపడ్డారో..? ‘అల్లుడు శీను’ సినిమాకు అంత కన్నా ఎక్కువ కష్టపడ్డారు. తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు తీసి దర్శకుడిగా గొప్ప స్థానంలో ఉన్నారు. అయినా ఆదితో తనను దర్శకుడిని చేసిన సురేష్ గారి అబ్బాయిని పరిచయం చేసే బాధ్యతను తీసుకోవడం గొప్ప విషయం. సినిమా విజయం సాదించాలి అని కోరుకుంటున్నాను” అని అల్లుడు శీను ఆడియోలో రాజమౌళి అన్నారు.

