ఫస్ట్ లుక్ తో ‘అప్పుడు-ఇప్పుడు’ !

ఫస్ట్ లుక్ తో ‘అప్పుడు-ఇప్పుడు’ !

Published on Oct 8, 2019 3:47 PM IST

యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తొన్న చిత్రం “అప్పుడు-ఇప్పుడు”. చలపతి పువ్వల దర్శకుడు. సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా,శివాజీరాజా,’మళ్లీ రావా’ ఫేమ్ పేరుపు రెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లొ కన్పించనున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దసరా పండుగా సందర్భంగా ‘అప్పుడు-ఇప్పుడు’ ఫస్ట్ లుక్ ని విడుదలచేశారు..

ఈ సందర్భంగా దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – “ఈ రోజు మా చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదలచేయడం హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్ తో వస్తోన్న ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. సుజన్, తనీష్క్ ఇద్దరు చాలా బాగా నటించారు. అందరూ కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మా నిర్మాతలు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర విజయం పై మా టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం” అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ” విజయదశమి రోజున మా చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మా దర్శకుడు చలపతి పువ్వల కొత్తవారైనా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమా కోసం ఎంతో ఇష్టంగా వర్క్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు