రుక్మిణి వసంత్‌ను సెలెక్ట్ చేయడం పై మురుగదాస్ క్లారిటీ!

రుక్మిణి వసంత్‌ను సెలెక్ట్ చేయడం పై మురుగదాస్ క్లారిటీ!

Published on Feb 16, 2024 11:16 PM IST

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ AR మురుగదాస్ దర్శకత్వంలో SK23 అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అయితే ఈ హీరోయిన్ ను తీసుకోవడం పట్ల పలువురు లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్‌ను కాకుండా రుక్మిణి వసంత్‌ను ఎందుకు సెలెక్ట్ చేశాడో ఇటీవలి ఇంటర్వ్యూలో ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు.

మాకు ప్రాక్టికల్ అమ్మాయి లా కనిపించే నటి కావాలి. నేను, ఆమె (రుక్మిణి) సినిమాలు చూశాను. నేను వ్రాసిన పాత్రకు ఆమె వ్యక్తిత్వం దగ్గరగా ఉందని కనుగొన్నాను అంటూ చెప్పుకొచ్చారు. సప్త సాగరదాచే ఎల్లో రుక్మిణి వసంత్‌ను వెలుగులోకి తెచ్చింది. ఆమె ఇప్పుడు SK23 రూపంలో ఒక భారీ అవకాశాన్ని చేజిక్కించుకుంది. మరి ఆమె కోలీవుడ్ అరంగేట్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు