రణబీర్ కపూర్ హీరోగా నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ'(Ramayana) సినిమా టీజర్ నిన్న విడుదలైంది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పౌరాణిక చిత్రం, ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తయారవుతోంది.
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఈ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. కేవలం ఆ మొత్తమే కాకుండా, సినిమాకు వచ్చే లాభాల్లో కూడా ఆయనకు వాటా ఉండబోతోందని తెలుస్తోంది.
నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, యశ్ మరియు సన్నీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్ వంటి గొప్ప సంగీత దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం వల్ల సినిమాకు చాలా ప్లస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.
