సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎఆర్ రెహమాన్, అత్యంత ప్రసిద్ది చెందిన ఆస్కార్ అవార్డును కూడా అందుకొని ఏనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన రెహమాన్ ఇప్పుడు తనలోని మరో టాలెంట్ ని ఆవిష్కరించనున్నాడు. అదే స్క్రిప్ట్ రైటర్ గా మారడం. ప్రస్తుతం రెహమాన్ ఓ సినిమాకి స్క్రిప్ట్ నిరాస్తున్నాడు. ఈ సినిమాకి రైటర్ గానే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరింనున్నాడు. నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన ‘ఐ’ ప్రమోషన్స్ లో ఎఅర్ రెహమాన్ ఈ విషయాన్ని తెలిపాడు.
అలాగే రెహమాన్ మాట్లాడుతూ ‘ 2014 నాకు చాలా స్పెషల్ అలాగే చాలా బిజీ బిజీగా కూడా ఉన్నాను. ఈ సంవత్సరం మొత్తంగా 14 సినిమాలు చేసాను. అందులో మూడు హాలీవుడ్ సినిమాలు. ఐ కి పనిచేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. విక్రమ్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం ఒక వారం టైం తీసుకున్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఒక నెల టైం తీసుకున్నానని’ తెలిపాడు.
‘ఐ’ తెలుగు వెర్షన్ ఆడియో లాంచ్ ఈ రోజు సాయంత్రం హైదరబాద్ లో జరగనుంది. ఈ వేడుకకి ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు.


