హీరోగా జోరు మీదున్న ఏఆర్ రెహమాన్ మేనల్లుడు

gv-prakash1
సంగీత దర్శకుడిగా టాప్ పొజిషన్లో ఉన్న ఏఅర్ రెహమాన్ మేనల్లుడు జివి ప్రకాష్ కుమార్, హీరోగా కూడా సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. జివి ప్రకాష్ హీరోగా నటించిన తొలి సినిమా ‘డార్లింగ్’, సంక్రాంతి కానుకగా జనవరి 15న తమిళంలో విడుదలవుతుంది. తెలుగులో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’కు రీమేక్ ఇది.

‘డార్లింగ్’ తర్వాత హీరోగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. తెలుగమ్మాయి శ్రీదివ్య జంటగా నటిస్తున్న ‘పెన్సిల్’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ‘త్రిష ఇలియానా నయనతార’ అనే క్రేజీ టైటిల్ తో రూపొందనున్న మరో సినిమాకి సంతకం చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్, జనవరి 22న ప్రారంభమవుతుంది. వరుసగా సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటూ ఇతర తమిళ హీరోలను ఆశ్చర్యపరుస్తున్నాడు జివి.

Exit mobile version