మరోసారి ఆస్టార్ హీరో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్

మరోసారి ఆస్టార్ హీరో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్

Published on Jul 13, 2019 12:20 PM IST

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నడిచిన మిస్టర్ కె కె ఈ నెల 19న తెలుగు,తమిళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహిస్తుండగా అక్షరా హాసన్,లీనా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఐతే విక్రమ్ 58వ చిత్రంగా తెరకెక్కనున్న మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ మూవీ యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. డైరెక్టర్ మురుగదాస్ దాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ సుడియోస్,వియాకామ్ 18స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేసరికి ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో విక్రమ్ నటించిన విలన్,ఐ చిత్రాలకు రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు