కలెక్షన్స్ లో తేలిపోయిన అరణ్య !

Published on Mar 29, 2021 1:36 pm IST

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో నటించారు. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం రంగ్ దేతో పాటు మార్చి 26 న విడుదలైంది. కానీ ఈ సినిమాకి కలెక్షన్స్ మాత్రం చాల మందకొడిగా ఉన్నాయి. ఫారెస్ట్ నేపథ్యంలో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా స్లోగా సాగడంతో ఇప్పటివరకు కేవలం 2.4 కోట్లు మాత్రమే ఈ సినిమా వసూళ్లు చేసింది.

అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం స్లోగా సాగే సీన్స్ తో పాటు కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను చాలా నెమ్మదిగా నడుస్తోంది. అలాగే సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. అలాగే మధ్యమధ్యలో వచ్చే లాజిక్ లేని మినిష్టర్ ట్రాక్ కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. మొత్తానికి భారీ హోప్స్ తో రానా ఈ సినిమా చేస్తే.. చివరకు రానా కెరీర్ లో మరో ప్లాప్ సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది.

సంబంధిత సమాచారం :