‘హనుమాన్ జంక్షన్ 2’ పై అర్జున్ కామెంట్స్.. జగపతిబాబుని కలిశా

‘హనుమాన్ జంక్షన్ 2’ పై అర్జున్ కామెంట్స్.. జగపతిబాబుని కలిశా

Published on Feb 13, 2026 2:00 AM IST

Hanuman-Junction

మన తెలుగు సినిమా నుంచి వచ్చిన కొన్ని ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ చిత్రాల్లో యాక్షన్ కింగ్ అర్జున్ అలాగే నటుడు జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “హనుమాన్ జంక్షన్” కూడా ఒకటి. అందులో కామెడీ సీన్స్ కానీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాలుగా తెలుగు ఆడియెన్స్ ని అలరించి ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ అంటే దానిలోని సోల్ ని పోగొట్టకుండా తీయడం ఒకింత కష్టమే..

మరి ఈ సీక్వెల్ పై అర్జున్ సార్జా లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హనుమాన్ జంక్షన్ 2 చేయాలని తనకి కూడా ఉందని. దీనిపై జగపతి బాబుని కలిసినపుడు మాట్లాడిన సమయంలో తాను కూడా అదే అన్నాడు కానీ మంచి కథ సెట్ అవ్వాలని.. ఒకవేళ ఎవరైనా మంచి కథతో వస్తే తానే దర్శకత్వం వహించి నిర్మాణం వహించేందుకు సిద్ధం అని తన కూతురు ఐశ్వర్య అర్జున్ తెరంగేట్రం చేస్తున్న ‘సీతా పయనం’ సినిమా రిలీజ్ ఇంటర్వ్యూలో తెలిపారు. సో ఈ ఎంటర్టైనింగ్ సీక్వెల్ కి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కానీ కథ సెట్ అవ్వాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు