బాలీవుడ్ స్టార్ కోసం ట్రై చేస్తోన్న క్రేజీ డైరెక్టర్ !

Published on Mar 12, 2020 8:20 pm IST

‘అర్జున్ రెడ్డి’ అనే బోల్డ్ అండ్ అడల్ట్ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు స్టార్ డమ్ ను కూడా సంపాదించుకున్నాడు యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. పైగా ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఏకంగా బాలీవుడ్ లోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బోల్డ్ డైరెక్టర్ మరో వైవిద్యమైన చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. బాలీవుడ్ స్టార్ తోనే ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఏ బాలీవుడ్ ఓకే చెబుతాడో చూడలి. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లాలని చూస్తున్నాడు.

‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ వంగ తర్వాతి చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొచ్చారు. వీరితోపాటే సందీప్ వంగ అన్నయ్య ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. మొత్తానికి అదృష్టం అంటే సందీప్ వంగాదే. మొదటి సినిమా ఛాన్స్ కోసం సంవత్సరాలు తరబడి తిరిగి చిన్న నిర్మాతను కూడా ఒప్పించలేక తన కుంటుంబం చేతే డబ్బులు పెట్టించుకున్నాడు. కానీ, ఇప్పుడు సందీప్ అడగకుండానే స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం సినిమా అవకాశాలు ఇస్తున్నారు. అందుకే తన తరువాత సినిమాని కూడా పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా క్రైమ్ డ్రామాగా ఉండనుంది.

సంబంధిత సమాచారం :

More