‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ టైటిల్ ఏంటంటే !

‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ టైటిల్ ఏంటంటే !

Published on Oct 26, 2018 10:40 AM IST

Kabir Singh

గత ఏడాది విడుదలై సంచలన విజయం సాదించిన తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఇప్పుడు హిందీ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నే తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ చిత్రానికి ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈచిత్రాన్ని పూర్తి చేసి సినిమాను జూన్ 21 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ చిత్రం హిందీ లో షాహిద్ కపూర్ కు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

తాజా వార్తలు