హిందీ ‘అర్జున్ రెడ్డి’ విడుదల తేదీ ఖరారు అయింది !
Published on Jul 31, 2018 5:17 pm IST


‘అర్జున్ రెడ్డి’ తెలుగులో చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలనాత్మక విజయాన్ని అందుకొని తమిళ, హిందీ భాషల్లోకి గ్రాండ్ గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా, తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ అర్జున్ రెడ్డి చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆగష్టు మొదటి వారంలో హిందీ అర్జున్ రెడ్డి చిత్రం చిత్రీకరణ మొదలవ్వనుంది. ఇక వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన యువ దర్శకుడు వంగా సుందీప్ నే హిందీ వర్షన్ ను కూడా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నటించే మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook