లావణ్యను అర్జునే కాపాడాలి…!

లావణ్యను అర్జునే కాపాడాలి…!

Published on Nov 26, 2019 10:44 PM IST

arjunsura12

చిత్ర సీమలో టాలెంట్ కంటే కూడా విజయాలే కొలమానంగా కెరీర్ సాగుతుంది. అందుకే ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా లేకున్నా హిట్ అనే ఆ లక్ మాత్రం వెంట ఉండాలి. లావణ్య రావడమే ఓ మంచి చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అందాల రాక్షసి లాంటి చిత్రంలో ఆమె హీరోలకు మించిన ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కించుకోవడంతో పాటు, ఆ పాత్రలో తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది. ఆ తరువాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా వంటి విజయవంతమైన చిత్రాలలో లావణ్య నటించడం జరిగింది.

ఇక ఆతరువాత ఈమె నటించిన వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీనితో లావణ్యకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక విడుదలకు సిద్దమైన అర్జున్ సురవరం మూవీ కూడా అనేక ఒడిదుడుకులు అవాంతరాల మధ్య ఎంతో కాలంగా ఇబ్బందులు పండింది. ఈ మూవీ విజయం సాధిస్తే లావణ్య కెరీర్ కొంచెం గాడిన పడుతుంది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన అర్జున్ సురవరం ట్రైలర్ విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. మూవీ విజయంపై చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అలాగే లావణ్య సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏవన్ ఎక్స్ ప్రెస్’ సినిమాలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు