బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘సీతా పయనం’ వసూళ్లు.. మేకర్స్ అధికారిక ప్రకటన

బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘సీతా పయనం’ వసూళ్లు.. మేకర్స్ అధికారిక ప్రకటన

Published on Feb 19, 2026 8:00 AM IST

Seetha-Payanam

యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో నాలుగు రోజుల్లోనే రూ.8.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా ద్వారా అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను, నటుడు ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్‌ను వెండితెరకు పరిచయం చేశారు. తొలి సినిమాతోనే ఐశ్వర్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దీనికి తోడు అర్జున్, ధృవ్ సర్జాల అతిథి పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

దర్శకుడిగా అర్జున్ కథాకథనాలు, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మౌత్ టాక్ బాగుండటంతో వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని, రెండో వారం కూడా ‘సీతా పయనం’ విజయవంతంగా ప్రదర్శించబడుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు