షూటింగ్ ఏర్పాట్ల బిజీలో వెంకీ – పవన్ ల మూవీ

Pawan-Kalyan-Venkatesh
విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ రీమేక్ లో నటించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అలాగే ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి.

మాకు అందిన సమాచారం ప్రకారం రామానాయుడు విలేజ్ లో ఓ సెట్ ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇక్కడే మొదలవుతుంది. మొదట వెంకటేష్ ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మొదలు పెడతాడు. ఆ తర్వాత జూన్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

వెంకటేష్ మిడిల్ క్లాస్ వ్యక్తిలా కనిపించనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు.

Exit mobile version