ఆదివారం పెరిగిన “ఆర్టికల్ 370” వసూళ్లు!

ఆదివారం పెరిగిన “ఆర్టికల్ 370” వసూళ్లు!

Published on Mar 4, 2024 8:00 PM IST

యామి గౌతమ్, ప్రియమణి, రాజ్ అర్జున్ లు ప్రధాన పాత్రల్లో, ఆదిత్య సుహస్ జంభ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఆర్టికల్ 370. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నిన్న మరో 7.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఆదివారం రోజు భారీగా వసూళ్లు పెరగడం తో 50 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. దీంతో ఇప్పటి వరకూ 54.44 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

2019 లో ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడి జరిగిన తరువాత జమ్ము కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను కల్పించే విధంగా ఆర్టికల్ 370 ను రద్దు చేసే అంశం పై సినిమా తెరకెక్కింది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రం లో స్కంద్ సంజీవ్ ఠాకూర్, వైభవ్ తత్వవాడి, అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు