తెలుగు క్యారెక్టర్ విలన్‌ కి సతి వియోగం !

Published on Jun 17, 2021 4:00 pm IST

టాలీవుడ్‌ క్యారెక్టర్ విలన్‌ టార్జన్‌ అలియాస్‌ లక్ష్మీనారాయణ గుప్తా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. టార్జన్‌ సతీమణి ఉమారాణి(52) అనారోగ్యంతో నేడు కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో హాస్పిటల్ లో జాయిన్ అయి ట్రీట్మెంట్ పొందుతూ వస్తున్నారు. అయితే, ఆదివారం రాత్రి ఆమెకు సడెన్ గా గుండెపోటు వచ్చింది.

దాంతో వెంటనే తేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఉమారాణి ప్రాణాలు విడవడం బాధాకరమైన విషయం. ఉమారాణి మరణం పట్ల సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. కాగా టార్జన్‌ లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య ఉమారాణికి సంతానం లేకపోవడంతో అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ‘123తెలుగు.కామ్’ నుండి ఉమారాణి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :