ఆశీష్ గాంధీ ‘డానీ’ ఫస్ట్ లుక్ విడుదల.. జూన్ 26న రిలీజ్

ఆశీష్ గాంధీ ‘డానీ’ ఫస్ట్ లుక్ విడుదల.. జూన్ 26న రిలీజ్

Published on Feb 14, 2026 11:04 PM IST

Ashish Gandhi's Danny First Look Out

వాలెంటైన్స్ డే సందర్భంగా ‘డానీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. కళ్యాణ్‌జి గోగణ దర్శకత్వంలో ఆశీష్ గాంధీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘వెల్కమ్ టు లవ్ జంగిల్’ అనేది ఉపశీర్షిక. కొల్లి గోపాల కృష్ణ సమర్పణలో, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జి గోగణ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్, కుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో ఆశీష్ గాంధీ గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో పూర్తి రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ తన కాలి వేళ్లతో సిగరెట్ పట్టుకోగా, హీరో దాన్ని తాగుతున్న తీరు విభిన్నంగా ఉంది. రా అండ్ రస్టిక్ కథాంశంతో, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గీత రచయిత రాకేందు మౌళి ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసి, జూన్ 26న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

తాజా వార్తలు