పెళ్లి పేరిట మోసం.. ఎట్టకేలకు స్పందించిన నటి !

నటి అషురెడ్డి తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందంటూ హైదరాబాద్‌ షేక్‌పేట్‌ వాసి యెనుముల సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.9.35 కోట్ల విలువ చేసే నగదు, బంగారం, ఫ్లాట్‌లు, వాహనాలను తన పేరుపై నటి అషురెడ్డి రిజిస్టర్‌ చేయించుకుందని ఆయన ఆరోపించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఐతే, తాజాగా ఈ వార్తల పై నటి అషురెడ్డి స్పందించింది. తనపై వచ్చిన ఆరోపణల ఆధారంగా తన ప్రమేయం లేకుండా తన గురించి వార్తలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా లీగల్‌ యాక్షన్‌ తప్పదంటూ నటి అషురెడ్డి హెచ్చరించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ఐతే, ఆమె పోస్ట్ కి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మీ పై ఆరోపణల గురించి వార్తలు రాస్తే తప్పు ఏముంది ?, ఆ వార్తల్లో నిజం లేకపోతే.. అవి అవాస్తవం అని నిరూపించుకోండి’ అంటూ నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు.

Exit mobile version