సెట్స్‌పైకి వెళ్ళిన ‘అష్టా చమ్మా’ కాంబో సినిమా!

Mohana-Krishna-Indraganti-N
‘అష్టా చమ్మా’.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు ఓ మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు, నాని, అవసరాల శ్రీనివాస్‌లను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా. ‘అష్టా చమ్మా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాని, ఆ తర్వాత అనతికాలంలోనే వరుస హిట్లతో స్టార్ హీరో స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. ఇక మళ్ళీ ఏడేళ్ళకు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత హీరోగా స్టార్ స్టేటస్‍ను సొంతం చేసుకున్న నాని, దర్శకుడు హను రాఘవపూడితో తన కొత్త సినిమా షూటింగ్‌ను కూడా అప్పుడే పూర్తి చేసేసి, ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళారు.

తెలుగులో ఇప్పటివరకూ రానటువంటి ఓ సరికొత్త జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా నేడు సెట్స్‌పైకి వెళ్ళింది. ఓ ప్రేమకథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కామెడీని జతకలిపి ఓ సరికొత్త కథగా ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దారట. పకడ్బందీగా స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసుకొని నేడు సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమాను గతంలో ‘ఆదిత్య369’ లాంటి క్లాసిక్ సినిమాను నిర్మించిన కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నాని-ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్లో ఏడేళ్ల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై అనౌన్స్ అయినరోజునుంచే మంచి అంచనాలున్నాయి.

Exit mobile version