అనంతపురంలోనే ‘అసురన్’ రీమేక్

అనంతపురంలోనే ‘అసురన్’ రీమేక్

Published on Jan 8, 2020 3:00 AM IST

Srikanth Venkatesh

తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈ నెల 20న మొదలుకానుంది. సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉండేది కావడంతో సీమ జిల్లా అనంతపురంలో ఎక్కువ భాగం షూటింగ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

ఇప్పటికే లొకేషన్స్ ఫైనలైజ్ చేశారట టీమ్. అంతేకాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేయనున్నారట. ఇక నటీనటుల విషయానికొస్తే ఇందులో ప్రియమణి కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఇక మిగతా నటీనటుల విషయానికొస్తే అందరూ కొత్తవాళ్లనే తీసుకోనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు