అశ్వథ్థామ అందరికి నచ్చే సినిమా – నాగ‌శౌర్య

అశ్వథ్థామ అందరికి నచ్చే సినిమా – నాగ‌శౌర్య

Published on Jan 26, 2020 11:18 AM IST

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న `అశ్వ‌థ్థామ‌` చిత్రం జ‌న‌వ‌రి 31న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. కాగా శ‌నివారం ఖ‌మ్మంలో ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో అశ్వ‌థ్థామ‌ సినిమాలో హీరో అదే చేస్తాడు. మెహ్రీన్‌కు సినిమా అంటే ఫ్యాషన్. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందునే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఇది ఒక నిజాయితీ గల కథ. నా ఫ్రెండ్ చెల్లికి జరిగిన ఒక ఘ‌టనను ఆధారంగానే ఈ కథను రాసుకున్నాను. అశ్వథ్థామ అందరికి నచ్చే సినిమా అవుతుంది, సమాజంలో జరిగిన కథను నేను రాయడానికి ప్రేరేపించిన కొన్ని అంశాలు సినిమాలో చూస్తారు అని అన్నారు.

కాగా నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ ఉన్నాయట. మొదటిసారి ఈ చిత్రంలో నాగ‌శౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు