బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ కన్నడ చిత్రం ‘ఉల్లాస ఉత్సాహ’ ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘నువ్విలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ వంటి చిత్రాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులకు యామీ గౌతమ్ మరింత దగ్గరయ్యారు. ఐతే, యామీ గౌతమ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి, తన పై వచ్చిన విమర్శల సంగతి చెప్పుకొచ్చింది.
ఇంతకీ, యామీ గౌతమ్ ఏం మాట్లాడింది అంటే.. ‘నా కెరీర్‌లో అనేక అవార్డు వేడుకల్లో నాకు ఉత్తమ నటిగా నామినేషన్లు వచ్చినప్పటికీ.. నేను పెద్ద అవార్డులు గెలవలేకపోయాను. అయితే అవార్డు రాలేదనే బాధ నాకు లేదు. ప్రేక్షకుల ప్రేమే నాకు నిజమైన గుర్తింపు అని ఆమె చెప్పారు. ఆ తర్వాత యామీ గౌతమ్ మాట్లాడుతూ.. ‘ఒక దశలో నాకు అవకాశాలు తగ్గాయి. సినిమాలను వదిలి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి వ్యవసాయం చేయాలని కూడా ఆలోచించాను’ అని యామీ గౌతమ్ చెప్పారు.


