క్రేజీ కాంబినేషన్ పై మరో క్రేజీ రూమర్

క్రేజీ కాంబినేషన్ పై మరో క్రేజీ రూమర్

Published on Feb 25, 2024 3:04 PM IST

దర్శకుడు అట్లీ కుమార్ పేరు జవాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మార్మోగిపోగింది. నిజంగా ఆ స్థాయిలోనే జవాన్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. అందుకే, ఇప్పుడు అట్లీ తర్వాత సినిమా పై అందరి దృష్టి పడింది. అయితే, మరోసారి షారుఖ్‌తో పని చేయడం పై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన జీవితంలో చూసిన గొప్ప వ్యక్తుల్లో షారుఖ్ ఖాన్ ఒకరని డైరెక్టర్ అట్లీ చెప్పారు. జవాన్ సినిమా షూటింగ్‌లో ఆయన నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నానని అట్లీ చెప్పుకొచ్చాడు.

అట్లీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటం షారుఖ్‌కు మాత్రమే సాధ్యమన్నారు. జవాన్ కంటే మంచి కథ కుదిరితే ఆయనతో తప్పకుండా మరోసారి పనిచేస్తానని అట్లీ తెలిపాడు. దీంతో ఇప్పుడు అట్లీ – షారుఖ్ ఖాన్ కొత్త సినిమా జోనర్ పై ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా ‘రాజా రాణి’ లాంటి ఫ్యామిలీ నేపథ్యంలో ఉంటుందని టాక్ నడుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు