అట్లీ, షారుక్ సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే..

అట్లీ, షారుక్ సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే..

Published on Mar 16, 2021 8:13 PM IST

Shah Rukh Atlee

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా చేయలేకపోతున్నందున ఆలోచనలో పడిన షారుక్ లాంగ్ బ్రేక్ తీసుకుని చివరికి సౌత్ దర్శకులైతేనే మంచి మసాలా ఎంటెర్టైనర్ తీయగలరని భావించి అట్లీకి ఛాన్స్ ఇచ్చారు. చాలా నెలలు క్రితమే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. నవంబర్ లేదా డిసెంబర్ నుండి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.

ఇందులో షారుక్ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ కూడ ఉంది. కటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా ఇంకొకటి క్రిమినల్ రోల్ అని తెలుస్తోంది. మొదటిసారి
షారుక్ ఒక సౌత్ నుండి యువ దర్శకుడితో సినిమా చేస్తుండటం, అందునా ద్విపాత్రాభినయం కావడంతో చిత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నారు. ఈ చిత్రానికి ‘సంకీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అట్లీ అంటేనే యాక్షన్, కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. కాబట్టి ఈ చిత్రం కూడ ఆ తరహాలోనే ఇంకాస్త భారీగా ఉంటుందట. చిత్రం హిందీతో పాటు ఇతర ప్రధాన భాషల్లో సైతం విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు