‘అట్లీ’కి ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

‘అట్లీ’కి ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

Published on Mar 24, 2024 11:24 PM IST

షారుఖ్ ఖాన్ – నయనతార నటించిన బాలీవుడ్ చిత్రం జవాన్‌ తో దర్శకుడు అట్లీ కుమార్ పేరు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మార్మోగిపోయింది. భారీ స్థాయిలోనే జవాన్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇప్పుడు తన కల నిజమైందంటూ సోషల్‌ మీడియా వేదికగా అట్లీ ఆనందం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడంటే.. ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ఆయన అందుకున్నారు.

ఎన్డీటీవీ ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023- 2024’ అవార్డుల ప్రదానోత్సవాన్ని దిల్లీలో నిర్వహించింది. సినీ, క్రీడలు తదితర రంగాల్లో సేవ చేసిన వారికి ఈ పురస్కారాలు ప్రకటించడం జరిగింది. ఐతే, అట్లీతోపాటు సినిమా ఫీల్డ్‌ నుంచి ప్రముఖ నటుడు బాబీ డియోల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు