
మామూలుగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన ప్రతి సినిమాలోనూ తనే స్వయంగా ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. కానీ ఈ సారి ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాలో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నెలలు తాగించే బొమ్మాళి అలియాస్ సిస్టర్ రోల్ చేసిన కార్తీక నాయర్ పెట్టే ఇబ్బందుల కారణంగా అల్లరి నరేష్ మనల్ని తెగ నవ్వించనున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తైన ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
శేఖర్ చంద్ర అందించిన ఆడియోని ఇటీవలే విడుదల చేసారు. ఆడియో వేడుకలో రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా, ఈ సారి అల్లరి నరేష్ కచ్చితంగా ఆడియన్స్ ని నవ్విస్తాడని అంటున్నారు. ట్రైలర్ తో పాటు ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని సందర్భానుసారంగా, సినిమాలోని పాత్రలను వివరిస్తూ ఉండే పాటలే ఉండడం వల్ల విన్న ప్రతి ఒక్కరికీ మొదటిసారే నచ్చేస్తున్నాయి. అలాగే సాహిత్యం కూడా క్యాచీగా ఉండడంతో బాగా ఫేమస్ అవుతున్నాయి.
అల్లరి నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చిన్ని డైరెక్టర్. అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.