రేపు స్పెషల్ డే… సప్రైజ్ ఇవ్వొచ్చు కదా రాజమౌళిగారు

రేపు స్పెషల్ డే… సప్రైజ్ ఇవ్వొచ్చు కదా రాజమౌళిగారు

Published on Jul 3, 2019 11:48 PM IST

ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నటిస్తున్నారు. అందుకే సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు బయటికొస్తాయా అని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా రేపు జూలై 4 ప్రత్యేకమైన రోజు కూడా. ఎందుకంత ప్రత్యేకం అనుకుంటున్నారా.. రేపు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కాబట్టి.

ఈ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్నది సీతారామరాజు పాత్రనే. కాబట్టి ఆయన జన్మదినం సందర్బంగా ఆ పాత్ర గురించి అంటే అల్లూరి గెటప్లో చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేయడం లేదా ఫస్ట్ లుక్ విడుదల ఎప్పుడో చెప్పడం వంటి సప్రైజ్ ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని జక్కన్న గతంలో సినిమాను అనౌన్స్ చేసినట్టే రేపు ఉన్నట్టుండి ఏదైనా విశేషాన్ని చెబుతారేమో చూడాలి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు