ఆరా ఆఫ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మ్యాడ్ సాంగ్ కి డేట్ వచ్చేసింది!

UBS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశి ఖన్నాలుపవన్ సరసన నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి అవైటెడ్ రెండో సాంగ్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చేసారు. ఒక మ్యాడ్ పోస్టర్ ని దింపి ఆరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ రిలీజ్ ని అనౌన్స్ చేశారు.

మరి ఇందులో పవన్ కళ్యాణ్ తన ఐకానిక్ మ్యానరిజం మెడ మీద చెయ్యి వేస్తున్నట్టుగా చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ లో అనేకమంది ఆర్టిస్ట్ లు కూడా అదే మ్యానరిజం చేస్తున్నట్టు చూపిస్తున్నారు. దీనితో ఈ సాంగ్ తో మాత్రం మరోసారి హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ పల్స్ ని పట్టేసే విధంగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. అన్నట్టు ఈ సాంగ్ ని ఈ ఫిబ్రవరి 22న లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ ఏ లెవెల్లో కంపోజ్ చేసారో చూడాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా ఈ మార్చ్ 26న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version