
నాగ చైతన్య సమంత కలసి నటించిన ‘ఆటోనగర్ సూర్య’ మళ్లీ వార్తల్లో నిలిచింది. అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం కొన్ని ఆర్ధిక కారణాల వల్ల వాయిదా పడింది. గతంలో ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలితం చూపించాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ప్రస్తుతం అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి.
ఈ చిత్రం ఆర్ధిక సమస్యలన్ని దాటుకుని జూన్ 27న విడుదలకు సిద్దం అయ్యింది.
దేవ కట్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఆర్. ఆర్. మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది.

