
గత సంవత్సర కాలంపై నుంచే వాయిదా పడుతూ వస్తున్న సినిమా ‘ఆటోనగర్ సూర్య’. ఎట్టకేలకు ఈ సినిమా అన్ని ఫైనాన్సియల్ ఇబ్బందులను క్లియర్ చేసుకొని జూన్ 27న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సందర్భంగా పూర్తి విశేషాలను తెలియజేయడానికి ఈ చిత్ర టీం ప్రెస్ మీట్ పెట్టారు.
డైరెక్టర్ దేవకట్టా మాట్లాడుతూ ‘నేను క్రియేటివ్ తీయడానికి చిత్ర నిర్మాతలు అన్నీ ఇచ్చారు. కానీ కొన్ని అవాంతరాలు వచ్చాయి అవన్నీ ఇప్పుడు వీడిపోయాయి. మా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఖాయం. నాగ చైతన్యని పరిపూర్ణ నటుడిగా ఈ సినిమా ఆవిష్కరిస్తుందని’ అన్నాడు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘పలు సమస్యలు ఎదుర్కొన్నా ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకొని విడుదలకి సిద్దమైంది. నైజాంలో ఈ సినిమాని నేను డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ప్రచార బాధ్యతలు కూడా తీసుకున్నాను. ఈ నెల 21న నాగార్జున గారు ప్రెస్ మీట్ ఉంటుంది. అలాగే ఒకలైలా కోసం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య తిరిగి రాగానే ఈ నెల 25న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తామని’ అన్నాడు.
నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.