పవన్ కళ్యాణ్ ‘పింక్’లో ఆ సీనే హైలైట్ !

పవన్ కళ్యాణ్ ‘పింక్’లో ఆ సీనే హైలైట్ !

Published on Feb 24, 2020 7:22 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే కీలక సిన్నవేశాలను షూట్ చేసిన పవన్ కళ్యాణ్ పై తరువాత షెడ్యూల్ లో ఒక పవర్ ఫుల్ కోర్టు సీన్ ను చిత్రీకరించనున్నారట. సినిమా మొత్తంలోనే ఈ కోర్టు సీన్ హైలైట్ కాబోతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

అలాగే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారు. ఇక చిత్రబృందం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ టైటిలే ఫిక్స్ అయ్యేలా ఉంది. ఇదే టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. అన్నట్టు ప్రెజెంట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు