నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. కాగా ఆమధ్య నాగసౌర్య – మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగసౌర్య – అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల కూడా విజయాలు సాధించాయి.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. హిట్ కాంబినేషన్ కాబట్టి సినిమా పై బాగానే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడుతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని, మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని.. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.
